calender_icon.png 3 October, 2024 | 4:04 AM

సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలి

03-10-2024 01:53:50 AM

అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

దత్తమంటప కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రానికి గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): తమ సంప్రదాయాలను భవి ష్యత్ తరాలకు అందించే ఏ రాష్ట్రమైనా తప్ప క అభివృద్ధి చెందుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్ దుండిగల్ సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమంలో గణపతి సచ్చిదానంద స్వామిజీ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేం దర్ రెడ్డితో కలిసి దత్త మంటపాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామీ జీ నూతన ప్రార్థన మందిరాన్ని అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారన్నారు. స్వామిజీ దసరా పండగను తెలంగాణలో జరుపుకోవడం మన రాష్ట్రానికి శుభ సూచికమని, తెలంగాణకు మేలు జరుగుతుంద న్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధ ర్ బాబు సూచన ప్రకారమే ఈ అద్భతమైన కార్యక్రమాన్ని చూడగలిగినట్లు తెలిపారు.  ఈ ప్రాంతం ప్రప ంచ పర్యాటక క్షేత్రంగా మారాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామిజీ మంటపం కార్యక్రమానికి విచ్చేయడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గణపతి స్వామిజీ కాలుమోపడమంటే ఇక్కడి ప్రజల అదృష్టమని, ప్రజలు సుభీక్షంగా ఉంటారని అన్నారు. ప్రపంచమంతా ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ రావు, ఎస్‌ఎన్‌ఎస్‌ఆర్ శేఖర్ పాల్గొన్నారు.