calender_icon.png 8 April, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయ పట్టు!

06-04-2025 12:00:00 AM

కొత్త పెండ్లికూతురు.. ఆషాఢంలో అమ్మ ఇంటికి వచ్చి.. శ్రావణ పట్టు కట్టించాక మెట్టినింటికి చేరుతుంది. ఇక వరలక్ష్మీవ్రతానికొక పట్టుచీర కట్టి తీరాల్సిందే.. ఇన్ని అకేషన్లలో అందరూ పట్టులా మెరిసిపోవాలంటే.. ఆ పండుగలు ఘనంగా ఉండాలంటే మన చందన బ్రదర్స్‌లోని పెళ్లి పట్టు చీరలను ఒక పట్టు పట్టాల్సిందే! ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు.

దానిమీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. చీరలో చూడచక్కగా.. కుందనపు బొమ్మలా కనిపించాలంటే.. పట్టుచీర కట్టాల్సిందే. ఈ వేడుకకు ప్రత్యేకంగా మెరిసిపోవాలంటే.. కింది చీరలను ప్రయత్నించి చూడండి.

చీర చక్కగా..

కట్టుకున్న చీర మనల్ని డామినేట్ చేయకూడదు. ఆ చీరలో మనం మరింత అందంగా వెలిగిపోవాలి. అందుకు బ్లౌజ్ డిజైన్ కూడా దోహదం చేస్తుంది. టీనేజ్, యంగ్ అమ్మాయిలు బరువుగా ఉండే చీరలను ఇష్టపడరు. లైట్ వెయిట్ చీరలు వారికి బాగా నప్పుతాయి. 

పాతకాలపు స్టుల్..

టిష్యూ కోట శారీస్ ధరిస్తే క్లాసీ లుక్‌తో చూపులను కట్టి పడేస్తారు. పాతకాలపు స్టుల్.. లాంగ్ స్లీవ్స్, బోట్‌నెక్ బ్లౌజ్‌లు ధరిస్తే వేడుకలో వైవిధ్యంగా కనిపిస్తారు. కంచిపట్టు చీర ధరించినప్పుడు లెటెస్ట్ ఆభరణాలను ధరిస్తే మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ కట్టుతో బంగారానికే వన్నె తెస్తారు. పసుపు, ఎరుపు రంగు కాంబినేషన్ పట్టుచీర పండుగలకు ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి చీరల మీదకు టెంపుల్ జ్యువెలరీ ధరిస్తే పండుగకళ వచ్చేసినట్టే!

సరికొత్త కళ..

ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఎన్నో ఫ్యాషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కాని మన దక్షిణ భారతాన మాత్రం ఎప్పుడైనా వేడుక అనగానే పట్టుచీరలు మైండ్‌లో మెదులుతాయి. దేవాలయాలకు వెళ్లినప్పుడు, ఇంట్లో పూజల వేళ, ఇతర శుభకార్యాలకు పట్టు చీర కట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తుంటాం. వేడుకల సమయాల్లో పాజిటివ్‌నెస్‌ను మనలో నింపుతాయి.

వేడుకను మరింత కళగా మార్చేస్తుంది. నాణ్యమైన జరీతో డిజైన్ చేసిన ఈ చీరలు మన బామ్మల కాలం నాటి లుక్‌లో కనిపిస్తుంటాయి. రంగుల కాంబినేషన్స్, పల్లూ, అంచు డిజైన్లలో నేటి కాలానికి అనుగుణంగా చిన్నచిన్న మార్పులు జత చేశారు డిజైనర్లు.