calender_icon.png 24 September, 2024 | 8:59 PM

ట్రేడ్ యూనియన్‌ను పునరుద్ధరించాలి

24-09-2024 02:14:12 AM

ఆర్టీసీ ఎండీతో కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ట్రేడ్ యూనియన్లు ఉంటేనే కార్మికుల కు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుందని, అందుకే ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని రాష్ర్ట కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పేర్కొనారు. సోమవారం ఆయన తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సమ్మె చేస్తే యూనియన్లే లేకుండా చేసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ) యూనియన్ ప్రధాన కార్యదర్శి కొమురెల్లి రాజిరెడ్డి, గోపాల్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్నగౌడ్ పాల్గొన్నారు.