calender_icon.png 19 April, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 20న దేశవ్యాప్త సమ్మె

18-04-2025 05:25:49 PM

ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

మంచిర్యాల,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోరారు. శుక్రవారం మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయడం కోసం ఈ నెల 27న మార్క్స్ భవన్ లో కార్మిక సంఘాల సదస్సు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని అన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ల మెప్పు కోసమే కార్మిక చట్టాలను కుదించాలని ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.