calender_icon.png 15 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్

13-01-2025 01:51:45 AM

మహారాష్ట్ర ఇసుక మాఫియాను అడ్డుకున్న గ్రామస్థులు

కామారెడ్డి, జనవరి 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి 136 ఇసుక ట్రాక్టర్ల డంప్‌ను సీజ్‌చేసిన పోతంగల్ రెవెన్యూ అధికారులు శనివారం రాత్రి మరో 30 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. పోతంగల్ మండలం హంగర్గా రెండవ బ్రిడ్జి వద్ద మంజీర వాగు వద్ద నిల్వ ఉంచిన ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేశారు.

మంజీర వాగు నుంచి రాత్రి ఇసుకను టిప్పర్‌లో తరలించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని గుర్తించిన అంగరంగ గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇసుక డంప్‌లను విడిచిపెట్టి పారిపో యారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోతంగల్ ఇన్‌చార్జి తహసీల్దార్ సురేందర్ నాయక్, ఆర్‌ఐ నాగేశ్వర్‌రావు తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు.

శుక్రవారం రాత్రి పట్టుబడ్డ ఇసుకను ఐటీ కళాశాల భవన నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పగించారు. కాగా మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫీ యా పోతంగల్ మండలానికి చెందిన మాఫీయాతో చేతులు కలిపి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. వీరికి స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్న ట్టు తెలుస్తున్నది. పోలీస్‌శాఖలో కొంతమంది, రెవెన్యూశాఖలో కొందరి అధికా రుల అండ కూడా ఉన్నట్టు సమాచారం.