calender_icon.png 12 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

136 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్

12-01-2025 12:00:00 AM

కామారెడ్డి, జనవరి 11 (విజయక్రాంతి): విజయక్రాంతి పత్రికలో ‘మంజీరాలో ఇసుకా  వేట’ కథనం పేరిట శుక్ర  వచ్చిన కథనా  కామా  జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక మాఫీయా నిల్వ ఉంచిన 136 ట్రాక్టర్ల ఇసుక డంప్‌ను శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పోతంగల్ ఇన్‌చార్జి తహసీల్దార్ సురేందర్‌నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో సిర్పూర్, కుర్లా, కొడిచెర్ల వద్ద ఇసుక డంప్‌లపై దాడులు నిర్వహించి సీజ్ చేశారు.

ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకే రెవెన్యూ అధికారులు ఇసు  సీజ్ చేసినట్లు తెలుస్తున్నది. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి వెళ్లే మంజీరానదిలో ఇసుక మాఫియా ఇసుకను తవ్వి అక్రమంగా హైదారాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నది. కాగా ఇసుక మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండాలు ఉండటంతో అధికారులు కిమ్మనడం లేదని తెలుస్తున్నది.  ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అక్రమంగా ఇసుక వ్యాపారం చేసే వారి బండారం బయటపడుతుందని మంజీర నది పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు చెప్తున్నారు.