calender_icon.png 19 April, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

16-04-2025 10:34:31 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి తన ట్రాక్టర్ ద్వారా గునుకుల గ్రామ శివారులో గల నిజాంసాగర్ సాగర్ కెనాల్ నుండి ఎల్లారెడ్డి మండలం, అన్నసాగర్ గ్రామం మీదుగా అజంబాద్ నందు అధిక ధరలకు ఇసుక అమ్మడానికి  బుధవారం తీసుకెళ్తున్నారు. సమాచారం మేరకు ట్రాక్టర్ డ్రైవర్ విజయకుమార్ ను అన్నాసాగర్ వద్ద పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కట్టిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్, హెచ్చరించారు.