calender_icon.png 13 March, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 ట్రాక్టర్ల ఇసుక డంపు సీజ్

12-03-2025 09:21:29 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసారు మండలం అచ్చంపేట పంచాయతీ పరిధిలో మరుపల్లిలో బుధవారం ఇసుక డంపులను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. 18 ట్రాక్టర్లు తిస్కను తీసుకొచ్చి అనుమతి లేకుండా డంపు చేశారని రెవిన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. అదే ప్రాంతంలో మరికొన్ని ఇసుక డంపులు ఉండగా వాటిని సీజ్ చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్ఐ సాయిబాబాను వివరణ తమకు ఫిర్యాదు వచ్చిన స్థలానికి వెళ్లి పరిశీలించగా 18 ట్రాక్టర్ల విలువగల ఇసుక డంపులు చేసి ఉండడంతో వాటిని సీజ్ చేసినట్లు ఆర్ఐ తెలిపారు. అక్రమంగా అనుమతి లేకుండా ఇసుకను ఎవరు తరలించవద్దని ఆయన తెలిపారు.