calender_icon.png 2 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ క్వీన్

23-03-2025 12:00:00 AM

మల్లికా శ్రీనివాసన్.. అంటే చాలామందికి తెలియకపోవచ్చేమో కాని.. ట్రాక్టర్ క్వీన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. పురుషులకు మాత్రమే పరిమితం అనుకున్న రంగంలోనూ తమదైన ముద్ర వేస్తోంది. ‘ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్’ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె రూ. 10,000 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారుగా ఎదిగారు. 

1959లో జన్మించిన మల్లికా శ్రీనివాసన్ మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీని, అమెరికాలో ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికా నుంచి తిరిగొచ్చి వ్యాపారం రంగంలో అడుగుపెట్టారు.  దివంగత, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనంతరామకృష్ణన్ 1960లో చెన్నైలోప్రారంభించారు.  అయితే 1986 నుంచి మల్లిక కంపెనీ బాధ్యతలను నిర్వర్తించడం మొదలుపెట్టింది. తన సాహసోపేతమైన నిర్ణయాలతో కంపెనీని  బహుళ -మిలియన్ డాలర్ల వ్యాపారంగా మార్చింది. రైతులు ఆకాంక్షలను గుర్తించి దానికనుగుణంగా సంబంధిత ఉత్పత్తులుండేలా చూసుకున్నారు.

మధ్యతరగతి ప్రజల కోసం చౌకైన ట్రాక్టర్లను అందించడం మొదలుపెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ టీ షాపుల వద్ద ఆగి, వ్యవసాయ పద్ధతులు, సమస్యలు,  తెలుసుకోవడం, ఎలాంటి పరిష్కారాలు కావానుకుంటున్నారో అడిగి తెలుసుకునేది. అలా భారీ వ్యాపారం సామ్రాజ్యం స్థాపించి సుమారు రూ.10,000 కోట్ల ఆదాయంతో కంపెనీని విజయవంతంగా నడుపుతున్నది.