సరికొత్త ఆలోచనలతో పోటీలను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు...
గెలుపొందిన డ్రైవర్లకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే పాయం..
బూర్గంపాడు (విజయక్రాంతి): ట్రాక్టర్ నడిపే డ్రైవర్ల సామర్ధ్యాన్ని, వారి నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ ట్రాక్టర్ పోటీలు దోహదపడతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) అన్నారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఎక్కువ శాతం మన మండలానికి ఆనుకున్న పక్క రాష్ట్రం వేలేరు గ్రామంలో కోడిపందాలకు పరుగులు పెడతారు. సంక్రాంతి పండగ రోజు మంచి పోటీలను మన గ్రామంలోనే నిర్వహించి గెలుపొందిన వారికి తగిన బహుమతులు అందించాలని సంకల్పంతో మోరంపల్లి బంజర గ్రామంలో కొంతమంది రైతులు కలిసి పెద్దల సహకారంతో ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలను తలపెట్టడం జరిగింది. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బంజరు గ్రామం వేదికగా ఇలాంటి ట్రాక్టర్ డ్రైవింగ్ పోటీలు జరపటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రాలో నిర్వహించే పోటీలను తెలంగాణ రాష్ట్రం తన సొంత నియోజకవర్గంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నిర్వాకులు పోటీలలో డ్రైవర్లకు పెట్టినటువంటి నిబంధనలకు అనుగుణంగా సుమారు 50 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.
సుమారు 320 అడుగులు 8 అడుగుల వెడల్పు గీతల మధ్య ఎలాంటి గీతను తాకకుండా ట్రాక్టర్ ట్రాలీని రివర్స్ లో రెండు నిమిషాల కాల వ్యవధిలోని సుమారు 11 మంది డ్రైవర్లు చేరటం జరిగింది. అందులో 52 సెకండ్లలో మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన జింకల సుందర రామిరెడ్డి చేరుకొని మొదటి బహుమతిని గెలుసుకున్నారు. బుడ్డగూడెం గ్రామానికి చెందిన బొర్రా శ్రావణ్ కుమార్ 56 సెకండ్లలో చేరుకొని రెండవ బహుమతిని పొందారు. ఒక నిమిషం ఐదు సెకండ్లలో మర్రికుంట గ్రామానికి చెందిన మడకం రాజు చేరుకొని మూడవ బహుమతిని గెలుపొందారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి వారికి 10016/- ను ధనసరి శ్రీను, నలిని దంపతులు ప్రకటించగా, ద్వితీయ బహుమతి 5016/- ను బత్తుల రామకొండ రెడ్డి, బెజ్జం వెంకట్రామిరెడ్డిలు ప్రకటించారు. తృతీయ బహుమతి 3016/- నీ సోము ఆదిరెడ్డి ప్రకటించారు. గెలుపొందిన డ్రైవర్లకు నిర్వాహకులు అందించిన సీల్డ్ కప్పులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించారు. పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, ఇలాంటి పోటీలలో సామర్థ్యాన్ని నిరూపించుకుందేందుకు పోటీ పడాలని ఓడిని వారు తిరిగి గెలిచినందుకు ప్రయత్నాలు చేయాలని అన్నారు.
ఇలాంటి చక్కటి మంచి ఆలోచనతో బంజర వేదికగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మంచి ఆలోచనలతో ముందు అడుగు వేసిన సోము ఆదిరెడ్డిని ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న రోజులలో మొరంపల్లి బంజర గ్రామంలో నిర్వహించినటువంటి ఈ పోటీలు పలు గ్రామాలలో విస్తరించేలాగా జరగాలని ఆకాంక్షించారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రకటించిన వారిని ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్లు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, భూక్యా ఆనంద్, గ్రామ పెద్దలు సారెడ్డి దామోదర్ రెడ్డి, రొండా పుల్లారెడ్డి, జింకల కృష్ణారెడ్డి, కైపు ఏగిరెడ్డి, నగులూరి వీరారెడ్డి, నిర్వాహకులు మూల వెంకటరామిరెడ్డి, బత్తుల రామ కొండారెడ్డి, యారం నాగిరెడ్డి, బిజ్జ వెంకటరామిరెడ్డి, మూల నాగిరెడ్డి, గాది నర్సిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కామిరెడ్డి వెంకటరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, బొబ్బల వెంకటరామిరెడ్డి, మేడం సంజీవరెడ్డి, డాక్టర్ డ్రైవర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.