calender_icon.png 20 April, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ కు మంటలు అంటుకుని పాక్షికంగా దగ్ధం

13-04-2025 06:25:52 PM

బెల్లంపల్లి,13(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ కి చెందిన ట్రాక్టర్ అకస్మాత్తుగా మంటలు అంటుకొని పాక్షికంగా దగ్ధం అయ్యింది. వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ పక్కన చెత్త కుప్ప ఉంది. చెత్త కుప్పను కాలబెట్టడంతో చెత్త కుప్పకు పక్కన ఉన్న ట్రాక్టర్ కు అకస్మాత్తుగా మంటలు అంటుకొని పాక్షికంగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటి న సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.