మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసినట్టు మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపాలపూర్ గ్రామ మానేరు నది నుండి అక్రమంగా ఇసుకను మంథనికి తరలిస్తున్నారని, అందిన సమాచారం మేరకు గోపాలపూర్ నుండి మంథనికి తెల్లవారుజామున వస్తుండగా రచ్చపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ ఇసుకతో వస్తుండగా ట్రాక్టర్లను పోలీసులు ఆపి పత్రాలు ఇవ్వమని అడగగా ఎలాంటి అనుమతులు లేకుండా మంథనికి చెందిన వలిహమ్మద్ గోపాల్ పూర్ మానేరు నది నుండి ఇసుకను అక్రమంగా డ్రైవర్ తో తరలిస్తున్నారని, దీంతో ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని, మంథని మండలంలో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.