మెదక్, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఫెడరేషన్ జిల్లా ఎన్నికల అధికారి డీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాలు శనివారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో విజయవంతంగా ముగి శాయి. అతిథులుగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై అశోక్ కుమార్, మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, రాష్ట్ర పూర్వకార్యదర్శి ఆకుల రాంకిషన్ హాజర య్యారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పీ వెంకట్రాంరెడ్డి, ఎన్నికల అధికారి శ్రీనివాస్, పరిశీలకులు భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2024 సంవత్సరాలకు గాను మెదక్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా కొంగోటి యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా పి వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్ విజయ్ కుమార్, ఎం గోపాల్, బీ యాదగిరి, కే శ్రీనివాస్‌రెడ్డి, పీ భాగ్యలక్ష్మీ, డీ విఠల్‌రెడ్డి, డీ ప్రభాకర్, పీ లక్ష్మణ్, జిల్లా కార్యదర్శులుగా ఎస్ సాయిబాబా, వీ పద్మ, ఎండీ నసీరుద్దీన్, పీ రాజ య్య, ఎం సురేందర్, ఎల్ దేవీసింగ్, ఎల్ శ్రీనివాస్ జాదవ్, వీ ఉమామహేశ్వర రాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా వీ సంగయ్య, డీ హీరాలాల్, బీ రాజేంద్రప్రసాద్, సీహెచ్ సంగీత, ఎండీ నజీరుద్దీన్, ఏ రమేశ్, పీ రజితను ఎన్నుకున్నట్లు తెలిపారు.