calender_icon.png 8 November, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎస్ ను రద్దు చేయాలి: టిపిటిఎఫ్ డిమాండ్

31-08-2024 10:11:48 AM

సిద్దిపేట (విజయక్రాంతి): తెలంగాణ ప్రొగ్రేసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట రూరల్ మండల శాఖ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు జి .విష్ణు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ భవన్ లో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కే .తిరుపతి హాజరై మాట్లాడుతూ సిపిఎస్ విధా నాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పదివేల ఎల్ ఎఫ్ ఎల్ పోస్టులు మంజూరు చేసి ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కోరారు .రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఐదు డిఏలను వెంటనే చెల్లించాలని, జూలై 2018 నుండి నూతన పి ఆర్ సి నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ,రాష్ట్ర కౌన్సిలర్ భవాని,జానకి రాములు, లింగారెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల శాఖ నూతన కార్యవర్గాన్ని  ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సిద్దిపేట రూరల్ మండల శాఖ అధ్యక్షులు గా సీహెచ్.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డి. రాజు, ఉపాధ్యక్షులుగా రాజసింహ, వసంత, కార్యదర్శులుగా  సుకన్య , గోవర్ధన్ రెడ్డి జిల్లా కౌన్సిలర్ గా, అజీజ్,రాజేందర్ లు ఎన్నికయ్యారు.