calender_icon.png 22 October, 2024 | 1:58 AM

సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు

21-10-2024 06:56:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైదారాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా చేయాలంటూ అభ్యర్థుల పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గ్రూప్‌-1 అభ్యర్ధుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులకు సుప్రీం నిరాకరణించింది. పరీక్షలు ప్రారంభమవుతున్న దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ ఆహర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయన్నారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సమయంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేయడంతో గ్రూప్‌-1 అభ్యర్ధులు సంతోషించారు. గ్రూప్‌-1 అభ్యర్ధులు ఏలాంటి ఆలోచనలు లేకుండా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు సూచించారు. ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో అభ్యర్ధులంతా సద్వినియోగం చేసుకోని ఉన్నత ఉద్యోగాలు పొందాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

మేము మొదటి నుంచి గ్రూప్-1 అభ్యర్ధులకు అండగా ఉంటున్నామని, జీవో-29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్పారు. తను బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్నాని, రిజర్వేషన్లకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్-1 విద్యార్థులను పావుగా  వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి భవిష్యత్తును బాగుచేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.