calender_icon.png 25 February, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్.. రాజకీయాలను క్రికెట్‌తో ముడిపెట్టడం సరికాదు

25-02-2025 01:41:15 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో చెప్పాలి

భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాష్ట్రం పరిమితులు కేంద్రమంత్రిగా మీకు తెలియవా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో చెప్పాలి

 బండి సంజయ్.. రాజకీయాలను క్రికెట్ తో ముడిపెట్టడం సరికాదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో మాట్లాడితే మంచిది

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(Telangana MLC election campaign ) జోరందుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఐక్యత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిందని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్(TPCC president mahesh kumar) మాట్లాడుతూ... కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ రాజకీయాలను క్రికెట్ తో ముడిపెట్టడం సరికాదని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో మాట్లాడితే మంచిదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనులపై చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.

వాళ్లు పదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు తాము ఏడాదిలోనే ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ వెల్లడించారు. పార్ములా కార్ రేస్ అంశాన్ని తెలుసుకుని బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) మాట్లాడాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్రం పరిమితులు కేంద్రమంత్రిగా మీకు తెలియవా?, కులగణన సర్వే గురించి బీసీ నేత బండి సంజయ్ కు తెలియదా?, కేంద్రప్రభుత్వం నుంచి తెచ్చే నిధుల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.  తెలంగాణకు అదనంగా ఒక్క రుపాయి కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకురాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సోషల్ మీడియను తప్పుగా, అనైతికంగా వాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.