calender_icon.png 6 February, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాం: మహేష్ కుమార్

06-02-2025 05:55:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎంసీహెచ్‌ఆర్‌సీలో కాంగ్రెస్ శాసనసభా పార్టీ (Congress Legislature Party) సమావేశం ముగిసింది. దాదాపు ఐదున్నర గంటలపాటు సాగిన సీఎల్సీ సమావేశం ప్రశాంతంగా, సానుకూలంగా జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... సీఎల్సీ భేటీలో నేతలంతా వారివారి అభిప్రాయాలు చెప్పారని,  స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించామన్నారు. ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశాలు నిర్వహించుకోవటం తప్పేమీ కాదని, సమావేశంలో ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలు చెప్పారని ఆయన తెలిపారు.

నియోజకవర్గాలకు నిధుల గురించి ఎమ్యెల్యేలు అడిగారని, అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను జరుపుకునేందుకు ఈనెలలో రెండు భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. సభలకు అధిష్ఠానం నేతలను ఆహ్వానించేందుకే ఢిల్లీ వేళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించామని, పథకాలను ప్రజలకు ఎలా వివరించాలని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్ధేశం చేశామన్నారు. కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నామని, కులగణనపై దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని సూచించామని మహేష్ చెప్పారు. బీజేపీతో సంబంధం బలోపేతం కోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆయన దుయ్యబట్టారు.