calender_icon.png 1 November, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు పత్రాలు... అక్రమ నిర్మాణాలు మీ హయాంలోనే..

30-08-2024 02:17:02 PM

నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగదు 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు అనుచరులు కలిసే తప్పుడు పత్రాలు ...అక్రమ నిర్మాణాలు సహకరిండ్రు 

విలేకరుల సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ఆగ్రహం 

మహబూబ్ నగర్ : తప్పుడు పత్రాలు సృష్టించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టి నిరుపేదలకు నీడని లేకుండా చేసిన ఘనత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి దక్కుతుందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజమైన లబ్ధిదారులు ఉంటే ఒక్క మారు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలని వారికి కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చి అన్యాయం చేసిండ్రు నిరుపేదలకు నీడ లేకుండా చేసిండ్రు అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత ఏం తో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో పట్టాలు ఇచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పడం హాస్యస్పదమన్నారు. నిజమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, అర్హులైన వారందరికీ ఇండ్లు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని తమ్ముడు తో పాటు కొందరు అనుచరులు కలిసి చాలామంది నిరుపేదలను మోసం చేసి తప్పుడు పత్రాలు సృష్టించి, అక్రమ నిర్మాణాలు చేసేందుకు సహకార అందించారని చెప్పారు.

మీ హయాంలో ఎందుకు దివ్యాంగులకు, నిరుపేదలకు ఇండ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నించారు. కూల్చివేయడంతో వాళ్లపై నీకు ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించడం సరికాదని వాళ్లకు మంచి చేయాలని అనుకుంటే నువ్వు ఎప్పుడో చేసే వాడిని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వారిని పరామర్శిస్తున్నట్లు వారికి భోజనం 24 గంటలు నువ్వే పెడుతున్నట్టు ప్రచారం చేసుకోవడం ఇంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల తొలగింపు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు అన్యాయం కాకుండా వారికి సరియైన న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

మీ హయాంలో కేవలం మీ కారు డోర్లు తీసేందుకే అధికార యంత్రంగాన్ని వాడుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛగా అధికారులు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారన్నారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండవలసిన అవసరం మాజీ మంత్రి శ్రీనివాస్ గారిపై ఉందని పేర్కొన్నారు. ఇప్పటికి చేరుకోకపోతే భవిష్యత్తులో శ్రీనివాస్ గౌడ్ ని జనం మరింత వెనక్కి నెట్టుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.