calender_icon.png 17 January, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌లాల్ మృతి

17-01-2025 02:29:11 AM

* నివాళులర్పించిన ప్రముఖులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రేమ్‌లాల్ లోథ బుధవారం రాత్రి కన్నుమూశారు. ధూల్‌పేట శ్మశానవాటికలో గురువారం యన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రేమ్‌లాల్ మృతిపట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు సంతాపం ప్రకటించారు.

ధూల్‌పేటలోని ప్రేమ్‌రాజ్ నివాసంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ జీ ఆదిత్యరెడ్డి, నాయకులు విఘ్నేష్, చేవెళ్ల జనార్ధన్ రెడ్డి, తివారీ తదితరులు ప్రేమ్‌లాల్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రేమ్‌లాల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.