21-02-2025 04:50:13 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఈనెల 23వ తేదీన గాంధీభవన్ లో జరగాల్సిన తెలంగాణ పీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం వాయిదా పడ్డింది. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ముఖ్య నాయకులంతా ప్రచార బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో టీపీసీసీ సమావేశం వాయిదా పడ్డింది. ఈనెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఈ కార్యవర్గ సమావేశం ఉండే అవకాశం ఉందని టీపీసీసీ వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్తగా నియామితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ గా మొదటిసారి ఈనెల 27 తర్వాత తెలంగాణకు రానున్నారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో కులగణన సర్వే నివేదిక, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, కాంగ్రెస్ ఎన్నికల హామీలు వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.