calender_icon.png 3 March, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి.. చర్చకు సిద్ధం

03-03-2025 03:18:54 PM

హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC president Mahesh Kumar) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి.. చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఏ కులానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు.

బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్(Congress party)పార్టీయే.. మిగిలిన పార్టీలకు ఆ సత్తా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అన్నారు. బీఆర్ఎస్ దుష్ర్పచారన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. పింక్ బుక్ ఓపెన్ చేస్తే కవిత చేసిన స్కాములు పాములై బయటకు వచ్చి కాటేసే ప్రమాదం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ మంత్రివర్గంలో మహిళకు స్థానం దక్కనప్పుడు కవిత ఏం చేశారు? అని ప్రశ్నించారు. కులగణన డాక్యుమెంట్ ను తగలబెట్టినందుకే తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేశామని మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar) పేర్కొన్నారు. కేదార్ నాథ్ మరణం వెనుక ఉన్న మిస్టరీ బయటకు రావాలి, కేదార్ నాథ్ మరణం మిస్టరీ వీడితే కేటీఆర్ బండారం బయటపడుతోందని సూచించారు.