హైదరాబాద్: కేటీఆర్ కు శిక్ష తప్పదు.. శిక్ష అనుభవించాల్సిందేనని టీపీసీసీ ఛీప్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ- ఫార్ములా రేసులో కేటీఆర్ అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ధనం కాజేసిన ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. వికారాబాద్ ఘటనలో తొలి ముద్దాయి కేటీఆర్ అన్నారు. అధికారులపై దాడులు చేయడమేంటి..? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కలెక్టర్ పై దాడి కేసులో నిందితుతెవరైనా వదిలేది లేదు.. కుట్రలో భాగంగానే కలెక్టర్ పై దాడి చేశారని తెలిపారు. పట్నం నరేంద్ర రెడ్డికి కేటీఆర్ ఫోన్ చేశారు.. నరేందర్ రెడ్డికి ఫోన్ రాగానే కార్యకర్తలతో దాడి చేయించారని విమర్శించారు. కేటీఆర్ ప్రోద్బలంతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగిందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.