calender_icon.png 21 December, 2024 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి

15-10-2024 06:11:36 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీ భవన్ లో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే రోహిత్ రావ్, ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడలు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో కలిసికట్టుగా పని చేయాలని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ లు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. ప్రజలకు, పాలనా యంత్రాంగానికి మధ్య పార్టీ నాయకత్వం వారధిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. స్థానికంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు.