calender_icon.png 3 October, 2024 | 4:42 PM

సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి

03-10-2024 12:47:31 PM

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినిమా పెద్దలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక విజ్ఞప్తి చేశారు. మంత్రి వ్యాఖ్యలతో సినీ ప్రముఖుల మనసు నొచ్చుకున్నందుకే వెనక్కి తీసుకున్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని  పీసీసీ ఛీఫ్ కోరారు. ఇరువైపులా మహిళలున్నారు.. కాబట్టి ఇంతటితో వదిలేయండన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని మంత్రి కొండా సురేఖ ఉద్దేశం కాదని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దని సూచించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ గౌడ్ హెచ్చించారు.