09-03-2025 07:40:35 PM
మంచిర్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు ఇచ్చిన హామీల అమలుపై ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్కని ఆదివారం సంప్రదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి న్యాయవాదికి రూ.5 లక్షల వైద్య బీమా, కొత్తగా నమోదు చేసుకున్న జూనియర్ న్యాయవాదులకు స్టైపెండ్, అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలు తదితరాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, లీగల్ సెల్ వైస్ చైర్మన్ లు తిరుపతి వర్మ, సంజయ్, మోమిన్, హైదరబాద్ చైర్మన్ కిషన్ రాజ్ చౌహాన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.