calender_icon.png 22 April, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

22-04-2025 01:39:32 PM

కాటేదాన్ లో షెడ్లు కూల్చివేత

రాజేంద్రనగర్: టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఐదు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపడుతున్నారు. సర్వే నంబర్ 168 నుంచి 178లో వెలసిన అక్రమ షెడ్ లను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా కొందరు భారీ షెడ్లు నిర్మించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీధర్ హెచ్చరించారు.