25-03-2025 03:40:11 PM
నేను చూసుకుంటాను లే అంటూ అందిన కాడికి దండుకున్న నాయకుడు
రాజేంద్రనగర్: సర్కిల్ పరోధిలోని అత్తాపూర్ డివిజన్ పరిధిలో పర్మిషన్ లేని బిల్డింగులను రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఏసీపీ శ్రీధర్(ACP Sridhar) ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభించారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా భవన యజమాని పట్టించుకోకపోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. భవన యజమాని పర్మిషన్ కు మించి రెండు ఫ్లోర్లు అదనంగా వేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఐదు, ఆరవ అంతస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు.
అంతా నేను చూసుకుంటాను లే..
అక్రమంగా నిర్మిస్తున్న భవనాల యజమానుల నుంచి జాతీయ పార్టీ నాయకుడు అందిన కాడికి దండుకున్నట్లు సామెతలు చెబుతున్నారు. అధికారులు వస్తే నేను చూసుకుంటానులే అంటూ వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడు భారీగా వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.