calender_icon.png 8 February, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదంలో పట్టణం

08-02-2025 12:00:00 AM

  1. మూలమూలన గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లు
  2. అనుమతులు శూన్యం అంతా బ్లాక్‌లోనే..
  3. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు మార్పిడి
  4. లీకైతే ప్రమాదం తప్పదు

సూర్యాపేట, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : పట్టణం బ్లాక్ వంటగ్యాస్ల దందా మూడు పూవ్వులు ఆరు కాయలుగా సాగు తున్నది. ఇంటి అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్లను వ్యాపార అవసరాలకు ఉపయో గి స్తున్నారు.

గ్యాస్ స్టవ్వుల రిపేర్ పేరుతో పట్టణంలో మూల, మూలకు గ్యాస్ పిల్లిం గ్ సెంటర్లు ఏర్పచుకున్న వ్యాపారులు పెద్ద సిలిండర్ల నుంచి గ్యాసును చిన్న సిలిండ ర్లలోనికి మార్చుతూ వ్యాపారం చేస్తున్నా రు. అంతా బహిరంగంగానే జరుగుతున్న అధికారులు పట్టించుకోక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇండ్లనే గోడౌన్ గా మార్చి..

జిల్లా కేంద్రలో ఇండియన్, భారత్, హెచ్పి కంపేనిలకు చెందిన గ్యాస్ డిస్టు బ్యూటర్లు ఉండగా వీరి గోడౌన్ లు పట్టణా నికి దూరంగా ఉంటాయి. అనుమతి ఉన్న కంపేనీల గోడౌన్ లు పట్టణానికి దూరంగా ఉంటే ఏలాంటి అనుమతులు లేని అక్రమ దందా చేస్తున్న వ్యాపారుల మాత్రం ఇం డ్లనే గోడౌన్‌గా మార్చుకున్నారు.

పెద్ద సిలిండర్ల నుంచి, చిన్న సిలిండ ర్లలోకి మార్చడం, కార్లలోకి ఎక్కిం చడం వంటి పను లను వీరు బహిరంగానే చేస్తున్నారు.  పట్టణంలో సుమా రు 30కి పైగా అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. చిన్న చిన్న కేంద్రాలలో రోజుకు రెండు నుంచి మూడు సిలిండర్లను ఖాళీ చేస్తుండగా, ప్రధానంగా మూడు కేంద్రాలలో రోజుకు ఒక్కొక్క సెంటర్లో 10 సిలిండర్లు  మార్పిడి జరుగు తున్నట్లు సమాచారం.

కిలోకు రూ. 120 చొప్పున అమ్ముతూ ఒక సిలిండర్‌పై  దాదాపు రూ. 600 సంపాదిస్తున్నారని వినికిడి. గ్యాస్ ఫిల్లింగ్ సమ యంలో ఏదైన ప్రమాదం జరిగి అవకాశం ఉన్న పట్టించుకునే వారే కరువయ్యారు. 

నేరుగా ఏజెన్సీల నుంచే..

ప్రధానంగా పట్టణానికి  చెందిన ఏజెన్సీ లతో పాటు సమీపంలో ఉన్న ఆర్వపల్లి, తుంగతూర్తి, నూతనకల్, నకిరేకల్ వంటి ప్రాంతాలలోని  గ్యాస్ డి బ్యూటర్ల నుంచి నేరుగా డొమోస్టిక్  సిలిండర్లను డిస్ట్రిబ్యూ టర్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

అంతే కాకుండా సూర్యాపేట పట్టణంలోని  పలు కుటుంబాలను వ్యాపా రులు పరిచయం చేసుకొని వారికి  సిలిం డరుకు రూ. 50 అధికంగా చెల్లించి వారి నుంచి సిలిండర్లను తీసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబందిత శాఖ అధికారులు స్పందించాలని సూర్యాపేట పట్టణ ప్రజలు కోరుతున్నారు.