calender_icon.png 29 March, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకున్న టౌన్ ఏసీపీ

24-03-2025 12:00:00 AM

కొత్తపల్లి, మార్చి 23: కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి తిరుగు పట్నాల సందర్భంగా కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి యాదవ్ కుటుంబ సభ్యులతో వచ్చి  శ్రీ మల్లికార్జున స్వామి దేవుని ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు బండి మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మా ఇలావేల్పు దేవుడు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలను చల్లంగా చూసి గొడ్డు గోదా గోర్లు పాడిపంట సల్లంగా చూడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసం మల్లేష్ యాదవ్, కొండ రవి యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, బండి సంపత్ యాదవ్, బండి రాజు యాదవ్, వంగ కొమురయ్య యాదవ్, కూకట్ల రాజయ్య యాదవ్ మరియు గ్రామ యాదవులు పాల్గొన్నారు.