- హైడ్రాపై కుట్రతోనే విష ప్రచారం
- హైదరాబాద్‌దే భవిష్యత్తు
- రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి
- హైటెక్స్ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులకు సక ల సౌకర్యాలతో అక్కడే అద్బుతమైన టవర్స్ నిర్మించడంతోపాటు నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి సకల సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవనం, ఆర్‌ఆర్ ఆర్‌తోపాటు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నామని, దేశం లో భవిష్యత్తు హైదరాబాద్‌దే అని చెప్పారు. హైటెక్స్‌లో శనివారం ఎన్‌ఈఆర్‌ఈడీసీవో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోలో భట్టి మాట్లాడుతూ.. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
ఈ ప్రాజెక్టులో నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లతో వడ్డీ లేని రుణా లు అందించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాపై కుట్రపూరితంగానే విపక్షాలు విష ప్రచారం చేస్తున్నా యని ధ్వజమెత్తారు. హైడ్రా ఎలాంటి నిర్మా ణ అనుమతులు ఇవ్వదని స్పష్టంచేశారు.
15 వేల ఎకరాల్లో గ్రీన్ బెల్ట్..
ఎయిర్‌పోర్టు నుంచి 30 నిమిషాల్లో చేరుకునేలా 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని భట్టి తెలిపారు. ఈ సిటీలో ప్రపంచస్థాయి వర్సిటీ, క్రికెట్ స్టేడి యం, ఏఐ ప్రాజెక్టులు ఉంటాయన్నారు. 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్‌గా ఉంటుందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌గా రూ.10 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
ఎన్నికల కారణంగా రిజిస్ట్రేషన్లలో కొంత స్తబ్దత ఏర్పడిన మాట నిజమేనని.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నట్టు తెలిపారు. రియల్టర్ల సమస్యలు వినడానికి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. రియల్టర్లతో బ్యాంకర్లకున్న సమస్యలపై ఇప్పటికే మాట్లాడినట్టు చెప్పా రు. త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఏర్పా టు చేసి మరింత స్పష్టత ఇస్తామన్నారు.