calender_icon.png 8 January, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యలు లేని సాగుబడి వైపు

16-10-2024 12:00:00 AM

డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి :

రైతులకు అందించాల్సిన సబ్సిడీలను, రాయితీలను, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రైతుకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు మాత్రమే వ్యవసాయ రంగాన్ని రైతు కష్టపడి అభివృద్ధి పరుస్తాడు. లేదంటే 2050 నాటికి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా.

భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం జనాభాలో 70శాతానికి  పైగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అందిస్తోంది. రైతు ఆత్మ హత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, రైతుల ఆదా యం , సామాజిక భద్రతను పెంచడానికి బహుముఖ వ్యూహం ఉన్నప్పటికీ, 2013 నుండి వ్యవసాయ పరిశ్రమలో ప్రతి సంవత్సరం 12,000 ఆత్మహత్యలు నమోదయ్యాయి.

దేశంలోని మొత్తం ఆత్మహ త్యల్లో 1శాతం కంటే ఎక్కువ మంది రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. 1970 నుండి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం జాతీయ విపత్తును సూచిస్తుంది.  ప్రైవేటు భూస్వాములు, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు, చెల్లించకపోవడం వల్ల 2014 నుంచి 2020 మధ్య ఆరేళ్లలో రైతు ల ఆత్మహత్యలు అధికంగానే ఉన్నాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలియజేస్తున్నా యి.

2021లో ప్రతి రెండు గంటలకు ఒక వ్యవసాయ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. 70 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. రైతుల ఆదాయం ,సామాజిక భద్రతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ విధానం ఉన్నప్పటికీ 2013 నుండి వ్యవసాయ రంగంలో ప్రతి సంవత్సరం 12000 ఆత్మహత్యలు నమోదయ్యాయి. 

ఏడు రాష్ట్రాల్లోనే అత్యధికం

 రైతు ఆత్మహత్యలలో సాగుదారులు, వ్యవసాయ కూలీలు కూడా ఉన్నారు. ఆత్మహత్యలు ఏడు రాష్ట్రాలలో 87.5 శాతం ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు రాష్ట్రాలలో  ఏటా సగటున 606 మంది సన్నకారు, చిన్నకారు రైతులు ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు. మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం.

హరిత విప్లవం నుండి ఎక్కువ ప్రయోజనం పొందిన పంజాబ్  దేశంలో రైతుల ఆత్మహత్యలు నిరుత్సాకరమైన చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తుంది. 1995 2017 మధ్య ఆ రాష్ట్రం నుండి 4687 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయి.

భారతదేశంలోని రైతుల ఆత్మ హత్యలకు ప్రధానమైన కారణం రుతుపవనాల వైఫల్యం, వాతావరణ మార్పులు, అధిక రుణ భారాలు, ప్రభుత్వ విధానాలు, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు వంటి అనేక కారణాలు ఉన్నట్లు మేధావులు పేర్కొంటున్నా రు.

దేశంలోని ప్రతి పదిమంది రైతుల్లో నలుగురు వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదని సర్వే వెల్లడి చేస్తుంది. వ్యవ సాయం చేసే రైతు తమ కుటుంబ సభ్యు లు, తన పిల్లలు తన వారసత్వంగా రైతు కావాలని కోరుకోకపోవడానికి కారణం ఇది ఒకటి కావచ్చు.

ఏడాదికి రూ. 77 వేలే ఆదాయం

చిన్న రైతుకు జీవధార సమస్య జటిలమైంది. చిన్న రైతులు సరైన నీటిపారుదలు లేకపోవడం వల్ల పంట నష్టం మొదలై అనేక ప్రమాదాలతో బాధపడుతున్నారు. 85 శాతం భారత రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమిలో పనిచేస్తున్నారు వీటిలో సగం దేశంలోని అనేక ప్రాంతాలలో పొడిగా లేదా వర్షాధార ప్రాంతాల్లో ఉన్నాయి. 

వ్యవసాయ ఉత్పత్తి నిష్పత్తి విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ గృహాల పరిస్థితుల అంచనా సర్వే 2013 ప్రకారం ఒక సాధారణ భారతీయ వ్యవసాయ కుటుం బం ఒక సంవత్సరంలో కేవలం 77,124 సంపాదిస్తుంది. అంటే నెలకు రూ. 6,427 అన్న మాట. ఇది కుటుంబ ఖర్చులకు కూడా సరిపోదు.

హార్డ్‌వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ప్రాముఖ్యత ఇచ్చి వ్యవసాయ వ్యాపారానికి కొంత రూపాన్ని ఇచ్చి కొంతమంది రైతుల గురించి నేతలు చెబుతుంటారు. ఈ రోజు ఆ రైతులు దేశంలోని  సంపన్న రైతులుగా పరిగణించ బడుతున్నారు. మిగతా రైతులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేదికల మీద రైతులపై అధిక ప్రేమ కురిపించినట్లుగా నాయకులు చెబుతారు. కష్టపడి పని చేయడం ఎంత ముఖ్యమో ఇన్నోవేటివ్ వర్క్ కూడా అంతే ముఖ్యం .

భారతదేశంలో వ్యవసాయం అతిపెద్ద రంగాల్లో ఒకటి. దేశ శ్రామికుల్లో  దాదాపు సగం మంది వ్యవసాయ రంగంలో ఉపా ధి పొందుతున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగం. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీలో) 17శాతానికి దోహదం చేస్తోంది. గ్రామీణ ఆదాయంలో 60 శాతం వాటాను కలిగి ఉంది.

భారతదేశంలోని వ్యవసాయ రంగం తృణధాన్యా లు, పండు,్ల కూరగాయలు, నూనె గింజలు చెరుకు, పత్తి వంటి అనేక రకాల పంటల ద్వారా వర్గీకరించబడింది. బియ్యం, గోధుమలు పప్పులు, చెరుకు, పత్తి వంటి అనేక వ్యవసాయ ఉత్పత్తులను అత్యధికంగా పండించే దేశాలలో భారతదేశం ఒకటి. అయితే  సరిపడా నీటిపారుదల, యాత్రీకరణ లేకపోవడం, తక్కువ ఉత్పాదకత, వాతావరణ మార్పులు వంటి అనేక సవాళ్లను కూడా ఈ రంగం ఎదుర్కొంటోంది.

ఈ సవాళ్లను పరిష్కరించడానికి, వ్యవసాయ రంగ వృద్ధి, అభివృద్ధికి తోడ్పడడా నికి భారత ప్రభుత్వం అనేక విధాలు కార్యక్రమాలు రూపొందించవలసిన అవసరం ఉంది. నీటిపారుదల వ్యవస్థ, పెట్టుబడులను పెట్టడం, అధిక దిగుబడినిచ్చే పంట రకాలు, యాంత్రీకరణను ప్రోత్సహించడం, విత్తనాలు వంటి ఇన్‌పుట్‌లను రాయితీపై రైతులకు అందించడం, సేంద్రీ య వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది . 

వేల సంవత్సరాలుగా భారతీయ నాగరికతకు వ్యవసాయం వెన్నెముక. భారతదే శం వ్యవసాయ పద్ధతులకు సంబంధించి గొప్ప చరిత్రను కలిగి ఉంది. శతాబ్దాలుగా వ్యవసాయ దేశంగా ప్రసిద్ధి చెందింది. 1960 దశకంలో ప్రారంభమైన హరిత విప్లవంతో అధిక దిగుబడి నిచ్చే రకాలైన పంటలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఒక కీలక రంగంగా కొనసాగుతోంది. లక్షలాది మందికి జీవనోపాధి అందిస్తోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.

వ్యవసాయం అంటే వ్యవసాయం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం, ఉద్యాన పెంపకం వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది. ఇది పంటలు పశువులు పౌల్ట్రీ ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో గణనీయమైన జనాభాకు వ్యవసాయ ఆదాయం జీవనోపాధికి ముఖ్యమైన వనరు.

వ్యవసాయ ఆదాయాన్ని వ్యక్తులు లేదా వ్యవసాయ కార్య కలాపాలు నిమగ్నమైన కంపెనీలు సంపాదించవచ్చు. కొన్ని దేశాల్లో వ్యవసాయ ఆదాయం పన్నుల పరిధిలోకి వస్తుంది. వ్యవసాయ ఆదాయాన్ని నియంత్రించే పన్ను చట్టాలు దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి.

వ్యవసాయ రంగం లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొన్ని దేశాలు పన్ను మినహాయింపులు లేదా ప్రోత్సాకాలను అందిస్తున్నాయి. అయితే రైతుకు తగినంత ఆదాయం రాక వ్యవసాయం పట్ల విరక్తి చెందిన చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రాయితీలపై రైతుల పెదవి విరుపు

వ్యవసాయ రంగ రాయితీలు వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతలను నిర్ధారించడానికి రైతులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం. ఈ సబ్సిడీలు వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించడం సమయానికి రైతులను ఆదుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం అందించే అనేక రకాల వ్యవసా య రాయితీలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో అమలు పరచడంలో ప్రభుత్వా లు చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవసాయ ఉత్పత్తుల ధరలను స్థిరీకరించడానికి ఉద్దేశించబడ్డాయి.

ఎంఎస్‌పీ అనేది రైతుల నుండి పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించే ధర. ఇది రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధరలను పొందే లా చేయడంలో సహాయపడుతుంది. రైతు లు తక్కువ వడ్డీరేట్లకు రుణాన్ని పొందడంలో సహాయపడడానికి రుణ సౌకర్యం అందించబడుతోంది. బీమా రాయితీలు రైతులురాయితీ ధరతో పంట బీమాను కొనుగోలు చేయడంలో సహాయపడతా యి.

ఇది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా వ్యాధుల కారణంగా పంట నష్టపోకుండా కాపాడుతుంది. అయితే వ్యవసా య రాయితీలు  రైతులకు మద్దతు ఇవ్వడంలో, దేశంలో వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అనడానికి రైతులు అంగీకరించడం లేదు అయినప్పటికీ ఈ సబ్సి డీల ప్రభావం, స్థిరత్వం గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి. 

గిట్టుబాటు ధర కల్పించినప్పుడే..

వ్యవస్థను సంస్కరించడానికి, మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులకు అందించాల్సిన సబ్సిడీలను, రాయితీలను, నాణ్యమై న విత్తనాలు, ఎరువులు, రైతుకు గిట్టుబా టు ధర కల్పించినప్పుడు మాత్రమే వ్యవసాయ రంగాన్ని ఆశించిన మేర రైతు కష్ట పడి అభివృద్ధి పరుస్తాడు.

లేదంటే  2050 నాటికి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జటిలం కాకముందే ప్రభుత్వాలు రైతులకు అందించాల్సిన కనీసం మద్దతు ధరను అమలు పరచడంలో నిర్లక్ష్యం వహిస్తే వ్యవసాయ భూమి బీడు భూమిగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.