బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశాపటానీకి యూత్‌లో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఇటీవలే తమిళంలో ‘కంగువా’ మూవీ చేసి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైంది. భాషతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే హాలీవుడ్ మూవీలో కాదులెండి.. వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది.
‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ నటుడు టైరీస్ గిబ్బన్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్‌లో నటించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. దీని నుంచి తాజాగా కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవడంతో దిశ హాలీవుడ్‌లో నటిస్తోందంటూ ప్రచారం ప్రారంభమైంది.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మెక్సికోలో జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో నటుడు హ్యారీ గుడ్విన్స్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కానీ సక్సెస్ అయితే అమ్మడికి హాలీవుడ్ అవకాశాలు పక్కా అని తెలుస్తోంది.