calender_icon.png 21 January, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక స్వావలంబన దిశగా..

21-01-2025 12:52:52 AM

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా తమ సత్తాచాటుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మనదేశం లో మహిళా శ్రామిక శక్తిని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వాలు మరిన్ని అవవకాశాలు కల్పించబోతున్నాయి. మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 బడ్జెట్‌లో చేర్చే అవకాశం ఉంది.

అయితే ప్రపంచ మహిళా శ్రామిక శక్తి శాతం 50 శాతంపైగా ఉండగా, పురుషులలో 80శాతం ఉంది. మనదేశంలోఇది పురుషుల్లో 77.2 శాతం, మహిళల్లో 41.7 శాతం ఉంది. అయితే చాలామంది మహిళలు వివిధ కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. సరైన రవాణా, నీటి వసతి, కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉండిపోయారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వాలు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. 

మహిళలకు రాకపోకలను పెంచ డం, ప్రజారవాణాను మెరుగుపర్చడం, పని ప్రదేశాల్లో శిశుగృహాలు  ఏర్పాటు చేయడం లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రాబోతు న్నాయి. 2047 నాటికి మనదేశం ‘అభివృద్ధి చెందిన దేశం’ అనే ట్యాగ్ సాధించాలంటే మహిళల భాగస్వామ్యం కచ్చితంగా అవసరం.

ఇది మహిళా లక్ష్యసాధనతోనే సాధ్యమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంత రిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తు న్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపిస్తే.. మహిళా శక్తికి ఇక తిరుగుండదు.