అండర్-19 అనధికారిక రెండో టెస్టు
చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 అనధికారిక రెండో టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ సోహమ్‌తో పాటు హర్వాంన్ష్ క్రీజులో ఉన్నారు. మిడిలార్డర్‌లో నిత్య పాండ్యా (94), సోహమ్ పట్వర్ధన్ (61 నాటౌట్), నిఖిల్ కుమార్ (61) అర్థశతకాలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హారీ హొస్త్రెక 2 వికెట్లు పడగొట్టగా.. ఒలీ పాటర్సన్, క్రిస్టియన్ హొవె, విశ్వ తలా ఒక వికెట్ తీశారు.