calender_icon.png 5 January, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటకులను నవ్వుతూ ఆహ్వానించాలి

02-01-2025 04:38:20 PM

ఐటిడి ఏపీఓ రాహుల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గ్రామానికి వచ్చే పర్యాటకులను మన ఇంటి బంధువులను ఏ విధంగా లోపలికి ఆహ్వానిస్తామో నవ్వుకుంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి గిరిజన సాంప్రదాయంకు సంబంధించిన సపర్యలు చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు దుమ్ముగూడెం మండలంలోని పాత నారాయణపేట గ్రామంలో పర్యాటకుల కోసం తయారు చేస్తున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు.

గ్రామం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఏ విధముగా అతిధి మర్యాదలు చేస్తున్న విషయాలు గ్రామస్తులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అతిధులకు తప్పనిసరిగా గిరిజన సాంప్రదాయ ప్రకారము లోపలికి ఆహ్వానించి ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు వారికి తెలియజేయాలని, ఊరి యొక్క కట్టుబాట్లు, పురాతన కాలము నాటి నివసిస్తున్న ఇండ్లు, గిరిజనుల పంట పొలాలు ఔషధాలకు సంబంధించిన మొక్కలు గిరిజన వంటకాలు తయారుచేసి వాటి యొక్క విశిష్టత గురించి తప్పనిసరిగా వారికి తెలియజేయాలని అన్నారు. వచ్చే పర్యాటకులకు ఏమాత్రం అలసట నీరసం కలగకుండా వారికి తప్పనిసరిగా వివిధ కల్చర్ కు సంబంధించిన ప్రోగ్రాములు వారికి చూపెట్టి వాటిలోని సారాంశాన్ని తప్పనిసరిగా వారికి తెలియజేయాలని, వివిధ ఆకుకూరలు, ఔషధ గుణాలు కలిగిన ఆకుకూరలతో తయారుచేసిన వంటకాలు వారికి వడ్డించిన తర్వాత ఆకుకూరలకు సంబంధించిన గుణగణాలు గురించి విశిష్టత గురించి పూర్తిస్థాయిలో వివరించాలని అన్నారు. 

అనంతరం పాత నారాయణపేటలోని ఆర్చరీ క్రీడా స్థలము, బొజ్జు గుప్పలోని చెరువులో బోట్ షికారు, మొక్కజొన్న, వేరే ఇతర పంటలను పరిశీలించి పంటలు ఏ విధంగా పండిస్తున్నది పర్యాటకులకు వివరించాలని, పర్యాటకులకు అందించే ఆహారము పరిశీలించారు. న్యాచురల్ గా పెంచుకునే పశుసంపద గురించి కూడా వారికి తెలియజేయాలని, తాతల కాలం నుండి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని వారికి తెలియజేస్తూ ఏ విధముగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారో, అదే మర్యాదపూర్వకంగా తిరిగి వారిని పంపించాలని అన్నారు.

పర్యాటకానికి అణువుగా నిర్మాణం చేపడుతున్న మంచెలు, ఆర్చరీ, స్వాగత ద్వారాలు ఐదో తారీకు వరకు పూర్తి కావాలని, పర్యాటకులకు ఎదుర్కొన్న దగ్గర నుండి ఈ స్థలాలను విశిష్టతను తెలపడానికి తప్పనిసరిగా గైడును ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ ప్రదేశంలో ప్లాస్టిక్ ను మాత్రం పూర్తిగా నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి, ఐకెపి ఏపీఎంలు హేమంత్ ని, సుకన్య, కిషోర్, నాగేశ్వరరావు సెక్రెటరీ స్రవంతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.