calender_icon.png 23 April, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి..

23-04-2025 04:42:05 PM

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కుంజ సూర్య..

పర్యాటకులపై దాడి అమానవీయ చర్య..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క(State Minister Seethakka) కుమారుడు కుంజ సూర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడు(Terror Attack)ల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.