ఫారెస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జంగల్ సఫారీ
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దట్టమైన అడవులు ఆ ప్రాధాకరమైన వాతావరణం చూడచక్క ప్రదేశాలు నెలకొన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనీ అడవుల్లో నెలకొన్న ప్రకృతి అందాలు వీక్షించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్యావరణ, పర్యాటక, వన్యప్రాణుల(Wildlife), పక్షి ప్రేమికులకు అవకాశాలను కల్పిస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే జిల్లాలో మూడుసార్లు బర్డ్ వాక్ ఫెస్టివల్(Bird Walk Festival) నిర్వహించి పక్షి ప్రేమికుల్లో చెదరని ముద్ర వేసుకుంది. బర్డ్ వాక్ ఫెస్టివల్ చేపట్టి నెల రోజులు కాకముందే మరో వినూత్న కార్యక్రమానికి ప్రణాళికలు చేపట్టారు.
ఫిబ్రవరి 2 న చిత్తడి నేలల దినోత్సవం(Wetlands Day) సందర్భంగా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో పెంచికల్ పేట్ అటవీ ప్రాంతం(Penchikalpet Forest Area)లో పర్యాటకుల(Tourists) కోసం ప్రత్యేకంగా జంగిల్ సఫారీ, ఫారెస్ట్ లో ట్రాకింగ్, నేచర్ ట్రయల్(Nature Trail), బర్డ్ వాక్(Bird Walk) చేపట్టన్నారు. వచ్చేనెల (1,2) రోజులపాటు జరగనున్న ఈ వేడుకకు పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరికి రూ.1500 ఫీజుగా తీసుకొని పర్యటనకు అనుమతి ఇవ్వడంతో పాటు బ్రేక్ ఫాస్ట్, భోజనం, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా అటవీశాఖ అధికారి నియోజకవర్గం నీరజ్ కుమార్ టేబ్రవాల్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం కాగజ్ నగర్ డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9346212281 సంప్రదించాలి.