calender_icon.png 16 January, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బొగత’కు పర్యాటకుల తాకిడి

14-07-2024 12:33:14 AM

 జయశంకర్ భూపాలపల్లి, విజయక్రాంతి : తెలంగాణ నయగారాగా పేరుగాంచిన బొగత జలపాతానికి రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. శనివారం సెలవు కావడంతో జలపాతం పర్యాటకులతో కళకళలాడింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొండలు, కోనల నడుమ నుంచి ఉరకలేస్తున్న అందాలు, జలపాతం సవ్వళ్లు తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటే నీళ్లను చూసి తన్మయత్వం చెందుతున్నారు.