18-03-2025 12:28:39 AM
మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): గత పదేళ్లలో రాష్ట్రానికి టూరిజం పాలసీ లేకపోవడంతో పర్యాటక అభివృద్ధి జరగలేదని, కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక టూరిజం పాలసీని తీసుకొచ్చామని, దాన్ని క్యాబినెట్ కూడా ఆమోదించినట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. త్వరలోనే తాను జిల్లాల్లో పర్యటిస్తానని, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తా మని చెప్పారు.
సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స భ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన స మాధానమిచ్చారు. ఎల్లారెడ్డిలోని పోచారం రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తామని, అందుకు నిధులను సై తం త్వరలోనే కేటాయిస్తామన్నారు. ప్రత్యేక పాలసీని రూపొందించి ఎ కో, ఎండోమెంట్, మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.