calender_icon.png 15 January, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు టూరేస్తున్నారు!

14-01-2025 02:05:47 AM

  1. దేశీయ పర్యాటకంలో హైదరాబాద్ టాప్-5
  2. పర్యాటకులను ఆకర్షించడంలో దూసుకెళ్తున్న రాజధాని
  3. అక్టోబర్ నివేదికలో కేంద్రం వెల్లడి

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు దేశీయ టూరిస్టులు క్యూ కడుతున్నారు. అక్టోబర్‌లో 7.10శాతం టూరిస్టులను ఆకర్షించి దేశంలోనే టాప్‌ణా నిలువడం గమనార్హం. కేంద్ర పర్యాటక శాఖ దేశీయ పర్యాటకులను ఆకర్షించిన నగరాల జా బితాను నెలవారీగా విడుదల చేస్తుంది. తాజాగా కేంద్రం  2024-అక్టోబర్ నివేదికను విడుదల చేసింది.

అందులో హైదరాబాద్ సత్తా చాటినట్లు నివేదిక పేర్కొంది. అయితే హైదరాబాద్‌కు వస్తు న్న టూరిస్టుల్లో 44.98శాతం మంది సెలవుల్లో సేద తీరేందుకు వస్తున్నట్లు చెప్పింది. వ్యాపార నిమిత్తం వస్తున్న టూరిస్టులు 15.95శాతం ఉన్నారు. దేవాలయాలకు వచ్చే వారు 4.86శాతం, చదు వు కోసం వచ్చేవారు 1.81 శాతం మంది ఉన్నట్లు కేంద్రం చెబుతోంది.   

దేశంలో డొమెస్టిక్ పర్యాటకులు గతేడాదితో పోలిస్తే 108,862 మంది పెరి గారు. 2023 అక్టోబర్‌లో దేశీయ పర్యాటకుల సంఖ్య 22,65,957మందికాగా.. 2024 అక్టోబర్‌లో 23,74,819 మందికి చేరుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు 7.10శాతం వచ్చినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, హైదరాబాద్‌కు వస్తున్న వారిలో మహిళలు 33.60శాతం కాగా.. పురుషులు 66.40శాతం ఉన్నారు.

అలాగే, జనవరి మధ్య కాలంలో హైదరాబాద్‌కు వచ్చిన మొత్తం పర్యాటకుల వివరాలను కూడా కేంద్రం వెల్లడించింది. ఈ పది నెలల్లో 2.50కోట్ల మంది పర్యటించగా.. గతేడాది ఇదే కాలంలో 23.31 కోట్ల మంది వచ్చారు.

అక్టోబర్‌లో వచ్చిన

టూరిస్టుల వివరాలు (శాతంలో)

ఢిల్లీ 21.22 

ముంబై 20.09

కొచ్చిన్ 8.10 

బెంగళూరు 7.67 

హైదరాబాద్ 7.10