01-04-2025 01:58:59 AM
ఏర్పాట్లు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కడ్తాల్, మార్చి 31 (విజయ క్రాంతి) : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బోయిన్ గుట్ట తండా, ముద్విన్ గ్రామానికి ఈ నెల 2న బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించనున్నారు. మండలంలో బోయిన్ గుట్ట తండాలో మహనీయుల విగ్రహాలు, ముద్విన్ లో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నూతనంగా నిర్మించిన ఇల్లు ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాట్లను కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ పరిశీలించారు. అయన వెంట మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మండల అధ్యక్షుడు పరమేష్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ మరియు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు పాల్గొన్నారు.