calender_icon.png 20 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌కార్డు హోల్డర్స్‌కు గడ్డుకాలమే

16-03-2025 12:00:00 AM

ఒకవైపు  అక్రమ వలసలపై  ఉక్కుపా దం మోపుతున్న ట్రంప్ మరోవైపు  ధనవంతులైన విదేశీయులకు గోల్డ్‌కార్డ్‌ను విక్ర యిస్తూ ,  ఇది అమెరికాలో నివసించే, పని చేసే హక్కును ఇస్తుందని తెలిపారు. 5 మి లియన్ డాలర్లు  రుసుము చెల్లించిన వారి కి పౌరసత్వానికి తెరతీశారు. రెండు రోజుల క్రితం  అమెరికా  ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ‘యూఎస్‌లో గ్రీన్‌కార్డ్ శాశ్వ త   నివాసానికి హామీ ఇవ్వదని, అమెరికన్లుగా ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూ డదో  మేము  నిర్ణయించుకుంటాం. గ్రీన్‌కార్డ్ వలసదారులకు అమెరికాలో ఉండ టానికి నిరవధిక హక్కును ఇవ్వదని తెలిపారు.  ప్రతిష్ఠాత్మక గ్రీన్  కార్డు చెల్లుబాటు పై కొత్త చర్చను తెరలేపారు.

అధికారికంగా శాశ్వత నివాసకార్డులుగా పిలువబడే గ్రీన్ కార్డులు విదేశీ పౌరులకు యునైటెడ్ స్టేట్స్ లో నివసించే,  పని చేసే హక్కును మం జూరు చేస్తాయి.  అయితే శాశ్వత నివాసం అనేది నిరవధిక నివాసానికి సంపూర్ణ హా మీ కాదని వాన్స్ స్పష్టం చేశారు.  జాతీయ భద్రత గురించి, అమెరికా ప్రజలుగా మ నం మన జాతీయ సంఘంలో ఎవరిలో చేరాలని నిర్ణయించుకుంటామనే దాని గురించి కూడా ఇది చాలా ముఖ్యమైనదని వాన్స్ ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఇంట ర్వ్యూలో అన్నారు.  విదేశాంగ మంత్రి, అ ధ్యక్షుడు ఫలానా వ్యక్తి అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకుంటే,  వారికి ఇక్క డ ఉండటానికి చట్టపరమైన హక్కు ఉండదని తెలిపారు.

గ్రీన్‌కార్డునూ రద్దు చేయవచ్చు

 గత  కొన్ని నెలల కిందట  ఇజ్రాయెల్, -హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో  కొలంబియా విశ్వవిద్యాల య గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమూద్ ఖ లీల్ పాత్రను నిర్ధారిస్తూ  అరెస్టుచేయడానికి ప్రతిస్పందనగా వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఖలీల్ గ్రీన్ కార్డ్‌ను ట్రంప్ ప్రభు త్వం  రద్దు చేసిందని అతని న్యాయవాది తెలిపారు.  న్యూయార్క్ ఫెడరల్ జడ్జి జెస్సీ ఫర్మాన్ విచారణ జరిగే వరకు అతన్ని బహిష్కరించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నేర కార్యకలాపాలలో పాల్గొనడం, దేశం నుంచి ఎక్కువ కాలం గైర్హాజరు కావడం లేదా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పాటించకపోవడం వంటి పరిస్థితులలో గ్రీన్ కార్డును రద్దు చేయడానికి యూఎస్  చట్టం అనుమతిస్తుంది. 

గ్రీన్ కార్డ్ హోల్డర్లు యూఎస్ ప్రజల మాదిరిగానే మొదటి సవరణ హ క్కులు కలిగి ఉంటారు. శాంతియుత నిరసనతో సహా రాజ్యాంగపరంగా రక్షణల సం దర్భాలు సాధారణంగా గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి కారణం కాదు. తీవ్రమైన నేరా లు లేదా ఇతర స్పష్టమైన ఉల్లంఘనలకు గ్రీన్ కార్డులు రద్దు చేయబడతాయని సర్కి ల్ ఆఫ్ కౌన్సెల్స్ భాగస్వామి రస్సెల్ ఎ స్టామెట్స్ అన్నారు.

కొత్తగా గోల్డ్ కార్డు

 ఇకనుండి  గోల్డ్ కార్డును అమ్మబోతున్నామని ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి అ న్నారు. ప్రజలకు  ఇప్పుడు  గ్రీన్ కార్డు ఉం ది. అది గోల్డ్ కార్డ్ కాదు. గోల్డ్ కార్డుపై దాదాపు 5 మిలియన్ల ధరను నిర్ణయిస్తాం. అది మీకు గ్రీన్ కార్డు హక్కులు ఇస్తుంది. అంతేకాకుండా అది పౌరసత్వానికి మార్గం అవుతుంది  తెలియజేసారు. గోల్డ్ కార్డు కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు యుఎస్‌లోకి  వస్తారని తెలిపారు. 

వర్క్ పర్మిట్ పొడిగింపుపై వివాదం

ఇప్పటికే ట్రంప్ వర్క్ పర్మిట్ పొడిగింపును వెనక్కి తీసుకున్న తరుణంలో హెచ్ 1 బి, ఎల్-1 వీసా హోల్డర్లు ప్ర మాదంలో ఉన్నారు.  బైడెన్ ఇచ్చిన వర్క్ పర్మిట్ పొడిగింపును సవాలు చేస్తున్న రిపబ్లికన్ సెనేటర్లు, ఇప్పుడు హెచ్ 1బి, ఎల్ -1 వీసా హోల్డర్లకు సంబంధించిన అమెరికా వలస విధానాలపై చర్చను  తీవ్రం చేశారు. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు బైడెన్ కాలం నాటి నిబంధనలు రద్దు చేయాలని ఒత్తిడి చేసి విజయం సాధించారు. సెనేటర్లు జాన్ కెన్నెడీ  రిక్ స్కాట్ ఈ నిబం ధనను రద్దు చేయాలని కాంగ్రెస్ సమీక్ష చట్టం కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టి  ఇప్పటికే వేలమందిని వారి దేశాలకు పంపిం చారు. 

జనవరి 13న యూఎస్  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ద్వా రా ఖరారు చేయబడిన  నియమం యూ ఎస్‌లో తమ చట్టబద్ధమైన ఉపాధి స్థితిని కొనసాగించడానికి ఈ వర్క్ పర్మిట్లపై ఆధారపడే భారతీయ పౌరులు సహా అనేక మంది విదేశీ నిపుణులకు కీలకమైన జీవనాధారంగా ఉంది. వర్క్ పర్మిట్ పొడిగింపును రిపబ్లికన్ సెనేటర్ కెన్నెడీ విమ ర్శించారు, వలసదారులు సుదీర్ఘకాలం యూఎస్ అధికారులకు నివేదించకుండా ఉండటానికి ఇది అనుమతిస్తుందని, తద్వా రా ట్రంప్ పరిపాలన వలస చట్టాల అమలును క్లిష్టతరం చేస్తుందని అన్నారు.

అమె రికా అధికారులకు నివేదించకుండా ఉండటానికి వలసదారులకు ఎక్కువ సమయం ఇవ్వడం వలస చట్టాలను అమలు చేయడానికి, అలాగే అమెరికన్లను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నాలను అడ్డుకుంటుందని కెన్నెడీ పేర్కొన్నారు.  బైడెన్ తీసుకున్న చర్యలు ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతను నీరుగారుస్తాయని, అలాగే అమెరి కన్లకు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుందని సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి  ఇది అత్యంత సుదీర్ఘమైన బహిష్కరణ ప్ర యాణం. ముఖ్యంగా భారతదేశానికి బహిష్కరణ  గణనీయమైన మార్పు.  అమెరి కాకు అక్రమ వలసలకు ప్రధాన వనరులలో భారత్  ఒకటి.  బహిష్కరించిన వ్యక్తు లు భారత్‌కు పంపడానికి  అమెరికా సైనిక విమానం ఉపయోగించడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది.

సాధారణంగా, వాణి జ్య విమానాలు ఉపయోగించి బహిష్కరణలు జరుగుతాయి. కానీ తాజా చర్య ట్రం ప్ వలస విధానం ప్రకారం దూకుడుగా వ్యవహరించడాన్ని సూచిస్తుంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అధ్యక్షుడు ట్రంప్‌తో బలమైన దౌత్య సంబంధాన్ని కొనసాగించినప్పటికీ, బహిష్కరించబడిన వ్యక్తులు వచ్చిన పంజాబ్‌లోని అధికారులు అమెరికా కఠినమైన చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలపై ట్రంప్ కఠిన వైఖరిని ఖండిస్తూ, భారత ప్రభుత్వం జో క్యం చేసుకోవాలని విపక్షాలు కోరుతున్నా యి.

భారత ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రం గా పరిగణించాలి. అనేక భారతీయ రాష్ట్రా ల ప్రజలను బహిష్కరించారు. విదేశాలలో మెరుగైన జీవనోపాధిని కోరడం వారి ఏకై క నేరం.  ట్రంప్ మానవతా ప్రాతిపదికన తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలి. బహిష్కరణకు గురయిన వ్యక్తులు స్వదేశానికి వచ్చిన తర్వాత నేరస్థులుగా పరిగణించబడరని కూడా స్పష్టమైన హామీ లేదు.  2022 ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకా రం, 700,000 మందికి పైగా పత్రాలు లేని భారతీయ వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. అదనంగా, రాబో యే నెలల్లో దాదాపు 20,000 మంది భారతీయ వలసదారులు బహిష్కరణకు గురవుతున్నట్లు సమాచారం. 

భారతీయులు అమెరికాలోకి చట్టవిరుద్ధంగా చొరబడుతున్నారనేది వాస్తవం. 2023లో  మెక్సికో ద్వారా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించిన 25, 000 మందికి పైగా భారతీయ పౌరులను అరెస్టు చేశారు. అదేవిధంగా, ఉత్తర అమెరికా,-కెనడా సరిహద్దులో అరెస్టుల సంఖ్య పెరగడానికి భారతీయ వలసదారులు దోహదపడ్డారు.  వలసదారులను సంకె ళ్ళు వేసి, చేతులు కట్టి, సైనిక విమానాలపై తీసుకెళ్లడం  దృశ్యాలు అక్రమ వలసలపై ట్రంప్ పరిపాలన కఠినమైన వైఖరిని మరింత బలోపేతం చేస్తాయి.

ఈ చర్య అక్రమ వలసదారులకు నిరోధకంగా, సరిహద్దు భద్రతపై ట్రంప్ నిబద్ధతకు నిదర్శ నంగానిలుస్తోంది.  బైడెన్ విధానాన్ని తిప్పికొట్టడంలో ట్రంప్ విజయం సాధిస్తే, వేలాది మంది విదేశీ కార్మికులు ఉద్యోగ నష్టాలకు, బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అమెరికాలో 7,00,000 మంది పత్రాలు లేని భారతీయులు ఉన్నారని అంచనా వేయగా, ట్రంప్ దూకుడు విధానం రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఎత్తున బహిష్కరణలు పెరుగుతూనే ఉం టాయని సూచిస్తోంది.   

-వ్యాసకర్త డా.ముచ్చుకోట సురేష్ బాబు సెల్:  9989988912