calender_icon.png 16 January, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుమిత్ నాగల్‌కు కఠిన డ్రా

26-07-2024 12:05:00 AM

  1. ఫ్రాన్స్ జోడీతో బోపన్న జంట అమీతుమీ
  2. పారిస్ ఒలింపిక్స్

పారిస్: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో కఠిన డ్రా ఎదురైంది. 80వ ర్యాంక్‌లో ఉన్న నాగల్ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ కోరెన్‌టిన్‌ను ఎదుర్కోనున్నాడు. ఈ ఇద్దరి మధ్య గత రికార్డు 2 ఉంది. నాగల్ తొలిరౌండ్ దాటినప్పటికి రెండో రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ అలెక్స్ డీ మినార్ (ఆస్ట్రేలియా) రూపంలో గండం పొంచి ఉంది. ఒకవేళ మినార్‌పై సంచలన విజయం సాధించినప్పటికీ మూడో రౌండ్‌లో నాగల్‌కు సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ రూపంలో అత్యంత కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది.

కాగా.. డ్రా ప్రకారం టెన్నిస్ దిగ్గజాలు జొకోవిచ్, నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్‌లో తలపడే చాన్స్ ఉంది. ఇక డబుల్స్ విభాగంలో భారత వెటరన్ రోహన్ బోపన్న శ్రీరామ్ బాలాజీ జోడీ తొలి రౌండ్‌లో ఫాబియన్ రిబౌల్ వాస్సెలిన్ జంటను ఎదుర్కోనుంది. కెరీర్‌లో చివరి ఒలింపిక్స్ ఆడనున్న బోపన్న 2016లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే.