ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
వేర్వేరు గ్రూప్‌ల్లో జొకోవిచ్, సిన్నర్
సిడ్నీ: ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించిన డ్రా గురువారం విడుదలయింది. పురుషుల సిం గిల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్‌కు కఠిన డ్రా ఎదురైంది. ప్రస్తుతం 96వ ర్యాంకులో ఉన్న నాగల్ తొలి రౌం డ్‌లో 26వ ర్యాంకర్ టోమస్ మెక్‌హక్‌ను (చెక్ రిపబ్లిక్) ఎదుర్కోనున్నాడు.
గతేడాది షాంఘై మాస్టర్స్‌లో మెక్‌హక్ స్పెయిన్ సం చలనం కార్లోస్ అల్కరాజ్‌కు షాక్ ఇచ్చాడు. నాగల్ గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 38వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్‌ను ఓడించి రెండో రౌండ్ చేరి అత్యున్నత ప్రదర్శన చేశాడు. ఇటీవలే ఆక్లాండ్ ఏఎస్‌బీ క్లాసిక్ టో ర్నీలో నాగల్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
ఇక 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నొవాక్ జొకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్ వేర్వేరు పార్శాల్లో ఆడ నున్నారు. నంబర్‌వన్ సిన్నర్ తొలి రౌండ్ లో నికోలస్ జెర్రీతో ఆడనున్నాడు. సిన్నర్‌తో పాటు టేలర్ ఫ్రిట్జ్, మెద్వెదెవ్, బెన్ షెల్టన్ ఒకే గ్రూప్‌లో ఉన్నారు. అంతా సవ్యం గా సాగితే ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్‌తో జొకోవిచ్ క్వార్టర్స్ ఆడనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబ ర్‌వన్ సబలెంకా తొలి మ్యాచ్‌లో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోనే స్టీఫెన్‌తో తలపడనుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్‌ను సబలెంకా సెమీస్‌లో ఎదుర్కోనుంది. ఇక రెండో ర్యాంకర్ స్వియాటెక్, ఎలీనా రిబాకినా ఒకే పార్శంలో ఉన్నారు.
జనవరి 12న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు తెరలేవనుంది. కాగా లెబనాన్‌కు చెందిన హాడీ హబీబ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సింగిల్స్‌లో బరిలోకి దిగనున్న తొలి లెస్బియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.