03-04-2025 12:00:00 AM
బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘జాట్’. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలి నేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెజీనా, సయామీఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్‌కుమార్‌సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్‌గా ఐటెం సాంగ్‌ను విడుదల చేశారు. ‘గాలోం కో టచ్ కియా.. బాలోం కో టచ్ కియా..’ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటోం ది. ఈ పాటలో ఊర్వశీ రౌతేలా డాన్స్ అమితంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌లోనే అందుబాటులో ఉన్న ఈ పాటకు కుమార్ సాహిత్యం అందించగా, తమన్ సంగీత సారథ్యంలో మధుబంతి బాగ్చి, షాహిద్ మాల్యా ఆలపించారు.