calender_icon.png 18 March, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంకుశ ధోరణి

18-03-2025 12:42:18 AM

ఓయూ ఉత్తర్వులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : ఉద్యమాల పురిటిగడ్డ  ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేయడం అప్రజా స్వామికమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థు లేనని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు గా పేర్కొన్నారు. కనీస విద్య, నివాస వసతులు కూడా కల్పించలేని ఉస్మాని యా వర్సిటీ యాజమాన్యానికి తమ ఆందోళన తెలియజేయడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు కనీసం నిరసన తెల పకుండా పోలీసుల పహారాలో అణచివేయాలని చూస్తే.. తెలంగాణ సమాజం చేతులు ముడుచుకొని కూర్చోదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

ఇలాగే విద్యా ర్థుల హక్కులను అణిచివేయడానికి ప్రయత్నించిన కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కే పరిమితం చేశారని అన్నారు. ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గద్దెదించడం తెలంగాణ విద్యార్థి, యువతకు పెద్ద విషయం కాదన్నారు. రాష్ర్ట ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలకు పోకుండా విద్యా ర్థుల హక్కులను హరించేలా విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెన క్కు తీసుకోవాలని డిమాండ్ చేశా రు.

విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ వేధింపులను ఆపాలని, వారిపై పోలీసు నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని ఆ యన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓయూ విద్యార్థులకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందన్నారు.