calender_icon.png 8 October, 2024 | 8:02 AM

2014లో లేక్.. 2023లో లేఅవుట్

08-10-2024 02:37:03 AM

  1. ఓఆర్‌ఆర్ పరిధిలో మొత్తం చెరువులు 920
  2. ఉమ్మడి పాలనలో 225 లేక్స్, గడిచిన పదేళ్లలో 44 లేక్స్ పూర్తిగా కనుమరుగు
  3. ప్రస్తుతం 171 చెరువుల్లో అక్రమ కట్టడాలు

హైదరాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)పరిధిలోని చెరువుల ఆక్రమణలు ఏటికేడు పెరుగుతూ వస్తున్నాయి. 2014లో చెరువులుగా వర్ధిల్లినవి 2023 నాటికి లేఅవుట్లుగా మారాయి. కొన్ని కట్టడాలతో పూర్తిగా కనమరుగయ్యాయి.

2014కు ముందుకు నగర పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా, వాటిలో ఇప్పటివరకు 269 చెరువులు నామరూపాలు లేకుండా కనమరుగయ్యాయి. ఉమ్మడి పాలన మొత్తంలో 225 చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం కాగా, ఒక్క తెలంగాణ వచ్చిన పదేళ్లలోనే 44 చెరువులు కనుమరుగయ్యాయి.

హైదరాబాద్‌లోని సచివాలయం లో సోమవారం ప్లానింగ్ శాఖ అధికారులు చెరువుల ఆక్రమణలపై శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గడిచిన పదేళ్లలో జరిగిన చెరువుల కబ్జా గురించి పూస గుచ్చినట్లు వివరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

పదేళ్లకు ముందు ఎలాంటి ఆక్రమణలకు గురికాని 20 చెరువుల్లో ఇప్పుడు పూర్తిగా కట్టడాలు వెలిశాయి. 24 చెరువులు పాకిక్షం గా ఆక్రమణలకు గురయ్యాయి. 2014 ముందు మొత్తం 127 చెరువుల్లో నామమాత్రంగా కట్టడాలు నిర్మించగా, ఆ తర్వాత పెరుగుతూ వచ్చాయి. ఇలా చిన్న పెద్దవి కలి పి మొత్తం 171 చెరువుల పరిధిలో ఏకంగా 386.71ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. 

చెరువుల వారీగా ఆక్రమణ ఇలా..

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో 9.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుప్పాలగూడ చెరువు ఉమ్మడి రాష్ట్రంలో నీటితో కళకళలాడేది. 2023 నాటికి ఆ చెరువు అన్యాక్రాంతమై కనుమరుగైంది. రాజేంద్ర నగర్‌లోని బద్వేల్‌లో 6.39 విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఇప్పుడు నామరూపాలు లేవు. 2014 నాటికి హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురికాకుండా 499 చెరువులు మాత్ర మే బయటపడ్డాయి. గడిచిన పదేళ్లలో వీటి లో 20 చెరువులు పూర్తిగా మాయమయ్యా యి. అలాగే మరో 57 చెరువుల్లో పాక్షికంగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి.

పదేళ్లలో చెరువుల ఆక్రమణలు (ఎకరాల్లో)

ఆక్రమణ స్థాయి చెరువుల విస్తీర్ణం ఆక్రమించిన విస్తీర్ణం

పూర్తిగా ఆక్రమణ 40.48 40.48

పాక్షిక ఆక్రమణ 866.42 126.12

పాక్షికం నుంచి పూర్తిగా ఆక్రమణ 97.99 63.81

పాక్షికం నుంచి పెరిగిన ఆక్రమణ 2,581.23 156.31

మొత్తం 3,586.12 386.71