calender_icon.png 21 April, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూకశ్మీర్‌లో కుండపోత వర్షం

21-04-2025 02:10:51 AM

  1. వరదల్లో చిక్కుకుని ముగ్గురి మృతి
  2. 100 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు

శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నుంచి కుండపోత వ ర్షం కురుస్తుంది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడం తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. వరదల్లో చిక్కుకున్న సుమారు వంద మందిని రెస్క్యూ బృం దాలు కాపాడి బయటకు తీసుకువచ్చాయి. 

పర్వత ప్రాంతాల్లో కొండచరి యలు విరిగి రహదారులపై పడుతున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొం డచరియలు పడి సుమారు 40 ఇండ్లు ధ్వంసమయ్యాయి. వరదల ఉధృతికి చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ పూర్తిగా కొట్టుకుపోయింది. రెస్క్యూ బృందాలు అప్రమత్తమై ముందుగానే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ముప్పు తప్పింది.

జమ్మూకశ్మీర్‌లో గడిచిన ఐదేళ్లలో ఈస్థాయిలో కుండపోత వర్షం, ఇంత బలమైన ఈదురుగాలులు వీయడం ఇదే మొదటిసారి అని వాతావరణశాఖ పేర్కొన్నది. వరద నష్టంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. వరదల నేపథ్యంలో కశ్మీర్‌కు భారీగా సహాయక బృందాలను పంపిస్తున్నామని, ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ముంపు ప్రాంతాల వాసులు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

రాంబన్ జిల్లాలో వరద నష్టం ఎక్కువగా సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు వెల్లడించారు. ఒక్క రాత్రిలోనే పూర్తిగా తాము సంపాదించుకున్న ఆస్తులు తుడిచిపెట్టుకుపోయినట్టు రాంబన్ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంబన్ జిల్లాలో నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.