16-03-2025 01:22:45 AM
వాషింగ్టన్, మార్చి 15: అగ్రరాజ్యాన్ని టోర్నడోలు వణికించాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడోల ధాటికి దాదాపు 19 మంది మరణించినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయ పడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఒక్క ముస్సోరి రాష్ట్రంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.
3 లక్షలకు పైగా జనాలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇక అర్కాన్స్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడగా.. 29 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. 138 మిలియన్ల మంది ఈ వాతా వరణం వల్ల ప్రభావితం అవుతున్నారు. ఇల్లియన్స్, మిస్సౌరి, అర్కాన్స్, మిస్సిసిపి, ఇండియానా రాష్ట్రాల్లో టోర్నడోల వీచే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు.