calender_icon.png 1 November, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాను కుదిపేసిన టోర్నడోలు

29-04-2024 12:10:00 AM


దక్షిణ చైనాలో కుండపోత వర్షాలు

ఐదుగురు మృతి, 33 మందికి గాయాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చైనాలోని గ్వాంగ్జౌ ప్రాంతంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోలా ధాటికనీసం ఐదుగురు చనిపోయారు, 33 మంది గాయపడ్డారు. శనివారం 1.9 కోట్ల వరకు నివసించే దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో టోర్నడోల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. 141 ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి, కానీ నివాస గృహాలకు ఎటువంటి నష్టం జరగలేదని చైనా మీడియా పేర్కొంది.

సెకనుకు 20.6 మీటర్ల గాలులు

గ్వాంగ్జౌ  నగరం హాంగ్ కాంగ్‌కు 130కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాజధాని.  బైయున్ జిల్లా లియాంగ్‌ట్యాన్ గ్రామంలోని వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సెకనుకు 20.6 మీటర్ల దూరం తుఫాను గాలులు వీచాయి. టోర్నడో ప్రభావం తగ్గిన తర్వాత సంబంధిత అధికారులు ఆదివారం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో సహాయ చర్యలను మొదలు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దక్షిణ చైనాలో వరద బీభత్సం

టోర్నడో ప్రభావంతో, ఎక్కువ రోజులు దక్షిణ చైనాలో కురిసిన వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. దక్షిణ ప్రాంతంలో నివసించే లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. క్వింగ్యువాన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లలో కురిసిన కుండపోత వర్షాల వల్ల దారులన్నీ జలమయమయ్యాయి. ఈ నెల చివరి వరకు ప్రాంతంలో కుండపోత వర్షాలు, భీకర తుఫానులు ఉంటాయని చైనా వాతావరణ సంస్థ వెల్లడించింది.